ఖయ్యాం రుబాయిలు -3

పక్షి రెక్కల వేగం పెంచింది చూడు.  అంతాన్ని  సమీపిస్తుంది.
నా జీవిత పాత్రని మధువుతో త్వరగా నింపు
చెట్ల మీద, కంచెల  నిండా, ఉదయాన్నే ఎన్ని పూవులు
విచ్చుకొని, గాలిలో నవ్వుతున్నాయో చూడు
పక్కనే ఎన్ని అందమైన పూవులు వాడి,
ధూళిలో నశించాయో అదీ చూడు.

ఖయ్యాం రుబాయిలు -1

పక్క మీద నేను ఇంకా కలలు కంటూ ఉండగానే
వినబడింది మహనీయమైన ఆ పానసాల లోంచి ఓ కేక
లేవండి పిల్లల్లారా లేవండి ఉదయమైంది
గిన్నె లోని జీవన మధువు ఎండి పోక ముందే గిన్నెల్ని నించుకోండి

ఖయ్యాం రుబాయిలు -2

నింపు, ప్రాణాన్ని మధువుతో నింపు
శీతాకాలపు పశ్చాత్తాప వనాన్ని వసంతాగ్ని లో మంటబెట్టు
నింపు నా పాత్రను నింపు.
కాల విహంగానికి నా జీవిక పధం లో ఎగరటానికి
ఎంతో దూరం లేదు.

చలం గారి ఉత్తరాలు

...కామనిరోధాన్ని బోధించే గాంధీగారిని చూస్తే నాకు కోపంగా వుంది. నేను అవినీతిని బోధించనీ, ఆదరించనీ, నాకు మొనాగమీలోనూ, దమనంలోను విశ్వాసం . కాని ఆ ఆదర్శ శిఖరాలెక్కడ, మనమెక్కడ? పోనీ వాటిని ఆదర్శాలుగా పెట్టుకుని, జీవితంలో వాటికై ప్రయత్నించరాదా? అంటారా మీరు? గాంధీగారితో నాకు విరోధమెక్కడ అంటే దమనం ఏ రోజునైనా సరే, ఎవరికైనా సరే చాలా సులభ సాధ్యమైనట్టు మాట్లాడతారు, ఆయన. He is misleading people and landing them into moral aberrations neurotic, vagaries and self deception. సాధ్యంగాని ఆదర్శానికై బలవంతపరిస్తే పర్యవసానం ఘోరం. ఆయన మాటని విచక్షణ లేకుండా నమ్మేవాళ్లు వేనకు వేలు వుండవచ్చు .
--చలం

సౌందర్యము

సుందరమైన కీర్తనలో ఈ తాళం ఈ రాగం ? అని అడుగుతున్నావు? అనుభవించటం చేతకాక! ఇదివరకు ఏమయినావు? ఇక ఎమౌతావు? ఎందుకివన్ని? వెన్నెట్లో కూర్చొని చంద్రుడు అస్తమిస్తాడ్లె.. నిన్న ఉదయించలేదే .. అని ఏడ్చే నిభాగున్ని నిన్ను చూసాను కాని! స్త్రీ ఒళ్లో ఎన్నాళ్ళు  కూర్చుంటుంది?  చంద్రుడెంత సేపు వెలుగుతాడు  ?  వెలిగితే.. నిద్ర పోతావు. అట్లానే నిలిస్తే ఆ సౌందర్యము  భరించగలవా ?  

అరుణ

"భర్త" ! ఆ మాట ముందు ఇష్టాలు, ధర్మాలు , హృదయాలు, స్వేచ్చాలు, ప్రేమలు, పాపాలు అన్ని తల వంచి తప్పుకోవలసిందే..
అన్ని మతాలు తల ఒంచ వలసిందే ఆ భర్త అన్న పదం ముందు. 
వాళ్ళు మాత్రం భర్తలు కారా? కాబోరా? సంసారపు హక్కుల్ని పునాదుల్ని ప్రశ్నించి ఎదురు తిరిగితే ఆడది? వాళ్ళ భార్యల మీద  హక్కులు నిలవాలా ? లేదా? 
అదే మగాళ్ళకు మగాళ్ళకు ఉండే కన్వెన్షన్ . ఫెయిర్ ప్లే . ఆ ప్లే లో ఆడది చేరదు.  అన్నీ మగాళ్ళ క్లబ్బులు.


స్వేచ్చ స్వేచ్చ అంటాం కాని మనని బంధించి నిలబెట్టే ఈ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ natural  laws  సరిగా పనిచేస్తున్నంత సేపే, మన స్వేచ్చ వాదాలు ప్రణయాలు. శరీరం సరిగా పనిచేస్తున్నంత సేపే అసత్యాలు శరీరపు నిబంధనలకి ఎదురు తిరగటాలూ! గంతులూ !

ఎన్ని కధలు రాస్తేనేం? కలలు కన్టేనేం? కబుర్లు చెప్తేనేం? భార్య భర్తతో వెళ్లనని ఎదురు తిరిగి గతి లేదని శరణు  చొస్తే..
అంతా ఎవరు ఆలోచించినా ఎంత ఆలోచించినా "నాకేం ఒరుగుతుంది , నాకేం లాభం లేదుకదా అనే కాని అమెకెట్లా ఉంటుంది అని కాదు."
"నా " అనేది మనసు నుండి వదలదు కదా.. 

స్త్రీల విషయం లో- అనుభవం - కొన్ని హక్కుల్ని, ఆ జన్మాంతపు హక్కుల్ని ఇస్తుంది పురుషుడికి.

చాలా సంస్కారం ఉన్న మనుషులే, ఎంతో విచక్షణ తో జీవితాన్ని చూడగల మేధా వంతులే, మనవ స్వభావాన్ని స్టడీ చేసిన పండితులే - స్త్రీ వ్యామోహం లో కాలు జారే టప్పటికి కళ్ళు కనబడక గోలుసువిప్పే వాడి చెయ్యి కరిచే కుక్కల్లగు వర్తిస్తారు..

మన ఇన్స్టింక్ట్ చేసే హడావిడి పైకి కనబడకుండా ప్రయత్నించటమే నాగరికతకు ఉండే ప్రధమ లక్షణం. 

విషాదం

ఒక్కక్కప్పుడు ఆలోచిస్తే, ఈ ఇతరుల మీది భయం (మనుషులకు ) పొతే నిజమైన ఆనందం ఎంత కలుగుతుందా, ఎన్ని బాధలు ప్రజలకు పోతాయా అని అనిపిస్తుంది.
సత్యాన్ని ఆచరించే ఆరోగ్యమైన బలమైన సంఘం లో నీతి అవినీతి అనే కృత్రిమత ను తీసివేసి అందరూ సహజంగా ఉంటే ఈ దొంగ వేషాలు కల్మషాలు ఉండవు. తమ ప్రకృతి ఎలా ఉంటే అలాగే కనపడటం తప్పు కాదనే సదభిప్రాయం ఒచ్చిన నాడు , ఎంత ధర్మం ఎక్కువవుతుందో ఈ లోకంలో.
జ్వరం వస్తే దాచడు . పైగా కనపడ్డ ప్రతివాడితోనూ చెప్పుకొంటాడు. ఈర్ష తో కాని లోభం తో గాని బాధ పడుతూ ఉంటే అవి దాచేందుకు ఎన్ని వంకర్లో తిప్పి బాధ పడతాడు. ఎప్పటికి ఈ భయాలు పోయి ఈ కృత్రిమ జీవనం లోనించి బైట పడి సహజంగా నిజమైన సౌఖ్యాన్ని, నిజమైన బాధల్ని అనుభవించ గలుగు తామో !

పురూరవ (1927)

ఊర్వశి : ప్రేమవల్ల నీకు ఏమి వచ్చింది?
పురూరవ: సుఖం
ఊర్వశి: అంతేనా? నరకం వచ్చిందా? విజ్ఞానం కలిగిందా? ప్రేమ అంటే నీకు ఏమి తెలుసు? నీ ద్రుష్టి ఇంకా విశాలం కాకుండా ఉంటుందా ? నిజంగా ప్రేమిస్తే?

మరి ప్రేమంటే ఏమిటను కొన్నావు?
నిన్నటి నుంచి నివు వినిపించిన ప్రేమ గీతాలు రాయటమూ, పాడ టమూ అనుకొన్నావా?
చెప్పావు గా గడచిన నీ ప్రేమ కధలు, ప్రేమంటే, ఆశించి స్త్రీ నీ ఆలింగనం లోనికి వస్తే ఈ భారమూ లేకుండా అనుభవించటం అనుకొన్నావా?
కంటికి బాగున్న స్త్రీ నల్లా నీ పాన్పు మీదికి ఆహ్వానించటం అనుకొన్నావా?

స్త్రీ సౌందర్యం ఎందుకు సృష్టించ బడిన్డను కొన్నావు?
పురుషున్ని కాల్చి మెడ వంచి, కళ్లు తెరచ టానికి .
అతని ఆత్మని అతనికి చూపటానికి.
తక్కిన ఆలింగానాలన్ని సృష్టి జరప టానికి .

చలం గారి ఉత్తరాలు (1947 -1977)

సూర్యుడు తప్పదు. ప్రతి ఉదయం వెలిగిస్తాడు. కాని మళ్ళీ సూర్యుడు దర్శనం ఇచ్చాడే అన్న సంభ్రమం కొత్తగా ఫీల్ కాక పొతే హృదయం చచ్చి నట్లేగా ? అలాగే మిత్రుల నుంచి వాక్కు విన్నప్పుడల్లా .

చలం గారి ఉత్తరాలు (1947 -1977)

పరిస్థితులు ఎప్పుడూ అట్లనే ఉంటై. మనసు అట్లా తిక మకలు పెడుతూనే ఉంటుంది. ఈ రెండిటినీ ఉపేక్ష చేయగల బలం కావలి. కాని అదే అసాద్యం. అందువల్ల అశాంతి . అదే మానవ జీవితం.

హాయిగా లేకుండా ఉండటం ఒక సుగుణం. బైట పరిస్థితుల వల్ల కాక అసలు లోపలనించే అశాంతి పుట్టుకు రావాలి. హాయిని కోరు కొంటాం కాని హాయి మృత్యువు. అదీ నా వేదాంతం . బాధ వల్ల చికిత్స కోసం వెతుకుతాం. గట్టి గా వెతికే వాళ్లకు అది దొరుకుతుంది.
Awesome Inc. theme. Powered by Blogger.