ఆనందం

సాధారణంగా మనుషులు ప్రేమ అనుకునేది ప్రేమకాదు. కామాన్ని, అలవాటునీ ప్రేమ అనే పేరుతొ పిలుస్తారు. మొహం కన్నా చాలా అతీతమైనది ప్రేమ . మొహంలో వలె ప్రేమలో శరీర వాంఛ ముఖ్యం కాదు. శరీర వాంఛ ఉండవచ్చు కాని దానికన్నా ఎన్నో రెట్లు తక్కిన ఆకర్షణలు బలంగా ఉంటాయి.

మొహం కలవాళ్ళు రెండో వాళ్ళని తమ సౌఖ్యం కోసం కోరతారు. తమకి దక్కనిదైతే ఆ మనిషి మీద మొహం చచ్చిపోతుంది.

ప్రేమ గలవారు తాము రెండోవారికీయ  గల ఆనందాన్ని గూర్చి ఆలోచిస్తారు. తమకి  వారివ్వగల ఆనందాన్ని గూర్చి తలపరు. రెండో వారి ఆనందంలో తాము ఐక్యమవుతారు  . తమని ప్రేమిచకపోయినా వీరి ప్రేమ పోదు. ప్రేమకి పూజ్య భావం ముఖ్యం. గౌరవము, భక్తీ లేనిదే ప్రేమ కాదు.

తమ మనస్సులో తోచిన సెంటిమెంట్లని, బలహీనమైనటువంటి  తాత్కాలిక ఆకర్షణలనీ , వాంఛల్నీ ప్రేమ అనుకుంటున్నారు.

ఇటువంటి ప్రేమ వెతికితే రాదు. తమ సంస్కారం చేత , స్వభావోవ్నత్యం చేత ఇటువంటి ప్రేమకి అర్హులవ్వాలి.
Awesome Inc. theme. Powered by Blogger.