బిడ్డల శిక్షణ (1924)

బిడ్డల కన్నా ఇతరమైన, బిడ్డ కన్నా శ్రేష్ట మైన అవసరాలూ, విలువలూ ఉంటే బిడ్డను కనకండి.


మంచి శిక్షణ కు ఉత్త ప్రేమ మాత్రమే చాలదు.
ఆ ప్రేమను క్రమమైన మార్గాల ద్వారా ఉపయోగించి బిడ్డ క్షేమనికి ప్రయత్నించేది జ్ఞానము. ఈ జ్ఞానానికి చోటు లేకుండా చేసి తరిమేస్తుంది సెంటిమెంట్ .
కానీ వాస్తవమైన ప్రేమ ఉంటే జ్ఞానానికి స్తలముంటుంది.
ప్రేమ లేకుండా ఉత్త జ్ఞానమున్న చాలదు. అప్పుడు ఇల్లు ఒక హాస్టలు లాగ ఉంటుంది.
ప్రేమకన్నా జ్ఞానం ముఖ్యం. అంతకన్నా రెండూ కలిసి ఉండటం ముఖ్యం.


బిడ్డను
తగిన శిక్షణ లో ఉంచితే ఈ బిడ్డ పెద్దదైనప్పుడు ఇప్పుడు ప్రజలకి ఉండే మూధత్వమూ, భయమూ కలిగి ఉండక ఉన్నతురాలు అవుతుంది. ఆ నైసర్గిక స్వభావోన్నత్యాన్ని బిడ్డలకు ఇవ్వగలిగితే చట్టాల వల్లా, సంస్కారాల వల్లా, బోధనల వల్లా కలిగించ తానికి ప్రయత్నించే మార్పులు ఏ శ్రమా లేకుండానే ప్రజలలో తటస్తిస్తాయి.
Awesome Inc. theme. Powered by Blogger.