దైవమిచ్చిన భార్య

హృదయం లో అతుక్కొని ఉంది ఆమె రూపం. ఒట్టి శరీరం అందం చూసి మొహించననచ్చు. శరీరం లోనించి, కళ్ళ లోనించి, మాటల్లో నించి చూసాను ఆమె ఆత్మ ఔన్నత్యాన్ని.


మెల్లి మెల్లిగా ప్రేమ సంపాదించటం దొంగ చూపులూ, దొంగ మాటలు ప్రయోగించటం, రెండో వారి అభిప్రాయం ఎలా ఉన్నదో కనుక్కోవటం, భయపడటం, సూచించటం, అనుమానించటం, ఆశలూ, నిరాసలూ, దొంగతనం, అబద్దం, మెల్లిగా మనసు లాగటం, తప్పు అభిప్రాయాలూ ప్రవేశ పెట్టటం ఇవన్ని మాలో ఎన్నడూ లేవు. మా ప్రేమ తప్ప ఇంకో ఆలోచన మాకు తట్ట లేదు. నేను బ్రతకటం, గాలిని, ఎండని అనుభవించటం ఎంత సహజమో పద్మావతి ని ప్రేమించటం కూడా అంట సహజమే. ప్రేమ గల స్నేహుతురాలు అంతే.



లోకము సంగతి తెలియదు నీకు. అనుభవం తక్కువ నీకు.
ఏమిటి కలిసి ఉంటే మాత్రం, శవాలు అన్నిటికి ప్రేమే?
ప్రేమ ఉంటే వాళ్ళ మొహాలు ఎందుకు ఏడుస్తూ అలా ఉంటాయి?
ప్రేమ జ్యోతి వెలిగే హృదయాల మీద మబ్బు పొర రావటం సాధ్యమా?
అనుమానాలు, అధికారాలు, రహస్యాలలో బతికే వాళ్లకు ప్రేమంటే ఏమి తెలుసు?


నిన్ను చూస్తె అప్పుడప్పుడు నీ తల్లి నైతే ఎలా ఉండేదో అట్లా అనిపిస్తుంది . ఇప్పుడు మరీ అట్లా అనిపిస్తుంది.
Awesome Inc. theme. Powered by Blogger.