చలం ఉత్తరాలు (1952-1979)

మీకోసం ఈ ప్రకారం లోకాన్నే మార్చాలా మనకు అనుకూలం గా? అంత కన్నా మీ ఒక్కరిని మార్చటం సులభం. అదే ఈశ్వరుడు చెయ్య బోతున్నది.
లోకాన్ని మించాలి. కాని లోకాన్ని వదిలి పరుగెత్తటం పిరికి తనం.

ఇది దీరత్వమా? తను తెచ్చుకొన్నది, నిర్మించు కొన్నది మనకు సౌఖ్యం ఇచ్చినన్నాళ్లేనా?
బాధ కలగ గానే ఒదిలించు కోవాలని చూడటమా?
బిడ్డను కనేది, ఏడిస్తే అల్లరి చేస్తే, తన్నేది, ఇంకా చాత కాక పొతే సన్యసించేదా ??
చాల భీరుత్వం ,అపచారం అది.

(ఆద్యత్మికాన్వేషణ లో ) మీ బంధువుల్నీ, మర్యాదల్నీ వదిలారనేది ఓ గొప్ప అర్హత. అది ఒదిలిన వాళ్లకు తక్కినవి ఒదలటం ఓ కష్టం కాదు.
కానీ వదలటం అంటే భౌతికం గా ఒదలటం కాదు. మనసులో పట్లు పోవటం ముఖ్యం. పట్లు వదులుకోవటానికి కొంత వరకైనా సిద్దం గా ఉండటం. పోనీ అవి వదిలితే బాడున్డునని వాంఛ ఉండటం.

అప్పుడు మామూలు శరీర మానసిక ఆకర్షణ నుంచి ఉన్నతం గా ప్రేమించ గల శక్తికి కళ్లు తెరుచు కొంటాయి. ఇది బూడిద బైరాగి తనం కాదు. అన్నిటినీ include చేసుకొనే ఒక విశ్వ ఆలింగనం.
ఇప్పటిమల్లె సంకుచితం గా, ఇరుకుగా కాక విశాలంగా ప్రేమించ గల దృష్టికి లిఫ్ట్ కావటం, ఎక్ష్పన్ద్ కావటం.


(ఆద్యాత్మిక అన్వేషణ అనే ) ఈ అగ్ని దీక్ష లో నిజమైనవి నిలుస్తాయి. ఊగేవి ఊడతాయి. మనం ఎంత నిజమని గోల పెట్టినా అబద్దాలు కాలి పోతాయి. మోసాలు తెగుతాయి.

Awesome Inc. theme. Powered by Blogger.