దైవమిచ్చిన భార్య

స్త్రీలు లు ఎందుకనుకొన్నావు ఉన్నది. జీవితమంటే ఎంత ఉన్నత మైనదో గాఢమైనదో పురుషునికి తెలిసేట్టు చెప్పేందుకు. పురుషుడిని ప్రోత్సహించాలి. స్వర్గానికి ఎత్తివేయాలి. గొప్ప పనులకు, గొప్ప ఆదర్శాలకు, గొప్ప ఊహలకు ఉత్సాహం ఇవ్వాలి. అగ్ని తో నింపేయాలి. నిర్జీవమైన బ్రతుకు లోనించి రక్షించాలి.

వాగ్దత్తం చెయ్యి. ఎప్పుడూ ఈ సామాన్యపు దేశ సేవకుల మల్లె తుక్కు కింద, ఏడుపు కింద, శవాకారం కింద తాయారు కానని. , వెధవ బ్రతుకు, పాడు మొహాలు వేసుకొని కళ్ళ మీద పొరలు కమ్మి కుళ్ళు నవ్వులు నవ్వుకొంటూ మర్యాదలో, గౌరవం లో, భయం లో, పిరికి తనంలో, ధర్మాచరణం లో, సనాతన ధర్మం లో, మత్తులో, కొంచం కొవ్వెక్కి, గుండ్రంగా తయారై, పిర్రలు బలిసి అలా బ్రతకనని ఒట్టేయ్యి.
Awesome Inc. theme. Powered by Blogger.