ప్రేమలేఖలు (1922)

ప్రేమలేఖ అంటే ప్రియ మైన మిత్రులకి రాయటం. పురుషులు గాని స్త్రీలు గాని సెక్స్ బేధమైనప్పుడు ప్రేమలో వలెనె లేఖలో కూడా రొమాన్స్ , పొయిట్రీ, tenderness ఎక్కువగా కానీ పిస్తాయి. లేఖలు ఎక్కువ అందం గా ఆకర్షణీయం గా ఉంటాయి.
ప్రేమలేఖలు కానివి పోస్టులో రోజూ వెళ్ళే లక్ష ఉత్తరాలు అన్నీ చెత్త , చికాకు వ్యవహారాల కోసం, దొంగ మర్యాదల కోసం, తగాదాలు, నోటీసులు రకాలు.
మొత్తనికి విసుక్కొంటూ రాసేవి ఏడుస్తూ చదివేవి గా ఉంటాయి.

నిర్వాజమైన స్నేహం ఉంటే గానీ, స్వచ్చమైన హృదయాలు ఉంటేగాని, మధుర మైన లేఖలు పుట్టవు. అట్లాంటి స్నేహం ఉన్నా ఉత్తరాలలో ఆ సంబంధాన్ని వ్యక్త పరుచుకొనే అభిలాష గాని, అభిరుచి గాని, శక్తి గాని ఉన్నవారు అరుదు.
Awesome Inc. theme. Powered by Blogger.