దైవమిచ్చిన భార్య

చిన్నతనం చాల సంతోషమైన కాలం అంటారు. హాయిగా చీకూ చింత లేకుండా భోజనం, చిరుతిండి బట్టలు ప్రేమగల దేవత మాకు సంసిండ్డం చేసి ఇస్తుందనే ఉద్దేశ్యం తో తిరగటం ఆడుకోవటం బాగా ఉంటుంది.
పెద్దవాళ్ళు ఎందుకో చిదరించు కొంటూ కోప్పడుతూ, ఏడుస్తూ బ్రతుకుతారు. అట్లా బతకక పోతేనేం?
ఆకాశం మబ్బులూ, పువ్వులూ, చిలకలూ, రైళ్ళూ , నీళ్ళూ ఇన్ని ఉండగా పెద్దవాళ్ళకు సంతోషం లేక పోవట మేమా అని సందేహం.
Awesome Inc. theme. Powered by Blogger.